Tuesday, September 17, 2024
Homeతెలంగాణహైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

హైదరాబాద్,ఎప్రిల్15(కలం శ్రీ న్యూస్):హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది.

హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నమోదు అయ్యింది, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ గారి పేరు మీద రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అందించారు.

హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం ఆనందంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్  అన్నారు,

దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్ గా మారుతుందని మంత్రి గుర్తు చేశారు

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!