Saturday, July 27, 2024
Homeతెలంగాణభారత దేశ అభివృద్ధికి పునాదులు వేసింది డా" బి ఆర్ అంబేద్కర్ 

భారత దేశ అభివృద్ధికి పునాదులు వేసింది డా” బి ఆర్ అంబేద్కర్ 

భారత దేశ అభివృద్ధికి పునాదులు వేసింది డా” బి ఆర్ అంబేద్కర్ 

అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్ 

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని ఏప్రిల్ 14(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జన్మదిన సందర్భంగా మంథని లో ఆయన విగ్రహనికి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పూలమాల వేసి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా సంఘల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి మహోత్సవంలో పాల్గొని సునిల్ రెడ్డి మాట్లాడుతూ

మన దేశం ఈ రోజు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసింది అంబేద్కర్

అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ పేరు ప్రఖ్యాతలను విశ్వవ్యాప్తం చేశారు కుల మత వర్ణ లింగ ప్రాంత భేదాలు లేని దేశంగా భారతదేశాన్ని నిర్మించాడు.నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అనే గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడని బడుగు బలహీన అభ్యున్నతికి పాటుపడి అంటారానితనం రూపుమాపాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారి సిద్ధాంతాలను అనుసరిస్తున్న ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు. ఈకార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,అసెంబ్లీ కో -కన్వీనర్ నాంపల్లి రమేష్, బిఎస్ఏ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువరి సతీష్, మండల ఇన్చార్జులు విరబోయిన రాజేందర్, తోట మధుకర్, మండల ఉపాధ్యక్షులు బూడిద రాజు, రేపాక శంకర్ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, వేల్పుల సత్యం,కోరబోయిన మల్లికార్జున్, చేరుకుతోట సుధాకర్, కాసర్ల సూర్య,ఎడ్ల సాగర్,బొల్లంపల్లి లక్ష్మణ్, కుమారస్వామి,ఎల్క సదానందం,బోసెల్లి శంకర్, దొడ్డిపట్ల శంకర్, కాయితి ప్రభాకర్, బుర్ర రాజు పార్వతి విష్ణు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!