కనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్.
కరీంనగర్,ఎప్రిల్13(కలం శ్రీ న్యూస్):
శాతవాహన విశ్వవిద్యాలయం నుండి కనుకుంట్ల వైష్ణవికి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీ.హెచ్.డి అందజేసినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్ టి. భరత్ ఆధ్వర్యంలో పర్ఫామెన్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్టర్ రేకాప్టిలైజేషన్ అసిస్టెన్స్ ఏ స్టడీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు కరీంనగర్ పై చేసిన పరిశోధనకు గాను బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో వైష్ణవికి డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కనుకుంట్ల వైష్ణవి కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్.మల్లేశం, రిజిస్టార్ వరప్రసాద్, బోర్డు ఆఫ్ స్టడీస్ శ్రీరంగ ప్రసాద్, ప్రిన్సిపల్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ హరికాంత్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మనోహర్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.