సిమెంట్ రోడ్లను పరిశీలించిన ఎంపీపీ కొండ శంకర్
మంథని ఏప్రిల్ 8(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం సిరిపురం గ్రామపంచాయతీ పరిధిలో 10 లక్షల రోడ్డు, చిల్లపల్లి గ్రామంలో 25 లక్షలతో వేసిన సిమెంటు రోడ్లను ఎంపీపీ కొండా శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గ్రామానికి అడగగానే వెంటనే సిమెంటు రోడ్లు మంజూరుచేయించారని ఆయన అన్నారు. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పుట్ట మధుకర్ చేస్తున్నారని అందుకే ఎక్కడ చూసినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుమ్మడి సత్యవతి – రాజయ్య, సర్పంచ్ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏగోలపు శంకర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు అక్కపాక సంపత్, పిక్కల రాజయ్య, సాగర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.