Saturday, July 27, 2024
Homeతెలంగాణలిక్కర్ స్కాములు,పేపర్లు లీకేజీ ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే బండి సంజయ్ ని...

లిక్కర్ స్కాములు,పేపర్లు లీకేజీ ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ 

లిక్కర్ స్కాములు,పేపర్లు లీకేజీ ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే బండి సంజయ్ అక్రమంగా అరెస్ట్ 

బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని ఏప్రిల్ 05(కలం శ్రీ న్యూస్ ): మంథని పట్టణంలో బిజెపి పార్టీ ఆఫీస్ లో విలేకరుల సమావేశాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గురువారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.రోజురోజుకీ బిజెపి పార్టీ మరింత పుంజుకుంటుందని బిజెపి పాలనలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రధాని మోదీ నిస్వార్థ సేవ వలన ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి పార్టీ అవతరించిందని బిజెపి పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రజాకారుల పాలన కొనసాగిస్తూ ఎటువంటి కేసు, నోటీసులు లేకుండా అర్ధరాత్రి పోలీసులతో మా అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేసి,రాక్షస ఆనందం పొందుతున్నారు.గ్రూప్ పరీక్ష పత్రాలు, పదవ తరగతి పరీక్ష పత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా అసమర్థ పాలనను నిలదీస్తున్న బిజెపి పార్టీపై అక్కసుతో ఇలాంటి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ దోపిడి దొంగల పాలను గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ సశక్తి కరాన్ అభియాన్ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువేరి సతీష్,పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, పోతరవేణి క్రాంతి కుమార్, రేపాక శంకర్,ఆఇంటి మల్లేష్,బొల్లంపల్లి లక్ష్మణ్,బోసెల్లి శంకర్,యువ నాయకులు ఎడ్ల సాగర్, దేవేందర్, పార్వతి విష్ణు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!