సుల్తానాబాద్ లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
సుల్తానాబాద్,ఎప్రిల్06(కలం శ్రీ న్యూస్): భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణం పరిదిలోని శాస్త్రినగర్ లో బిజెపి జెండా ఎగురవేసి, స్వీట్స్ పంపిణీ చేసిన బిజెపి నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు బిజెపి జెండా ఎగురవేయడం జరిగింది. అనంతరం మీసా అర్జున్ రావు మాట్లాడుతూ 1980 వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీగా పురుడు పోసుకున్న బిజెపి పార్టీ 1984లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి, అప్పటి నుండి నిరంతరం శ్రమిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అటల్ జీ, అద్వానీ జీ లు 2014 లో నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపికి 282 ఎంపీ స్థానాలు ప్రజలు కట్టబెట్టారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 303 ఎంపిలను గెలిపించారు. నరేంద్రమోదీ నాయకత్వం దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కనుక రాబోయే 2024లో 350 పై స్థానాల్లో గెలిచి హాట్రిక్ కొట్టబోతుంది. అలాగే తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కలిసి కృషి చేస్తున్నాయన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అక్రమ అరెస్టులకు బిజెపి న్యాయకత్వం, బిజెపి కార్యకర్తలు భయపడరు అని, బిజెపి నాయకులను, కార్యకర్తలను, ముందస్తు అరెస్టులు చేసి తెరాసా వారికి సహకరిస్తూ వారు బిజెపి కార్యకర్తలపై దాడి చేస్తుంటే పోలీస్ శాఖ వారు చోద్యం చూస్తూ ఉంటున్నారని అన్నారు. అలాగే శాస్త్రినగర్ బూత్ అధ్యక్షులు, పట్టణ ప్రధాన కార్యదర్శి బుసారపు సంపత్ అధ్యక్షత వహించి బిజెపి జెండా వద్ద కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమములో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి రాజు, సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల లింగారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు గడ్డం మహిపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సౌదరి మహేందర్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, సుల్తానాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు పల్లే తిరుపతి, గజభింకర్ పవన్, ఎనగందుల సతీష్, పట్టణ కార్యదర్శి గుడ్ల వెంకటేష్, BJYM జిల్లా కార్యదర్శి బుర్ర సతీష్, ABVP జిల్లా కన్వీనర్ రాసూరి ప్రవీణ్, మామిడి శేకర్, గోసుగుల రవీందర్, మెండ శంకర్, జెట్టి రాజు, గడాల ఆయుష్, సుల్తానాబాద్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.