బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
మంథని ఏప్రిల్ 5(కలం శ్రీ న్యూస్ ):రామగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు రామగిరి మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదవతరగతి పేపర్స్ లీకేజీల ప్రధాన సూత్రదారి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి సృష్టించాలని బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అని, స్వయంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం సిగ్గుచేటు లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్న కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ,ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దామెర శ్రీనివాస్,టిబిజికేస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, మండల మహిళా అధ్యక్షురాలు భూక్యా అశాకుమారి,మండల సోషల్ మీడియా ఇంచార్జీ బర్ల కుమార్,నాయకులు కాపరభోయిన భాస్కర్, గంట వెంకటరమణ రెడ్డి,అల్లం తిరుపతి,రొడ్డ శ్రీనివాస్,బుర్ర శంకర్,మేడగోని రాజయ్య,గాజుల ప్రసాద్,తుమ్మల అశోక్,అసం తిరుపతి,మల్యాల మెహన్,సల్పల సదానందం,జాపతి శేఖర్,ఆరు అయాదవ్,భాద్రరపు ప్రశాంత్,కోలిపాక సత్యనారాయణ, యాకుబ్,సైండ్ల సత్యం,సైండ్ల తిరుపతి,ఉగ్గెకుమార్,యండీ సలీం,కన్నూరి శ్రీశైలం,ఉరగొండ మధుకర్ రావు ,మల్యాల గణపతి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.