Saturday, July 27, 2024
Homeతెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్ నేటి పర్యటన కార్యక్రమాలు

మంత్రి కొప్పుల ఈశ్వర్ నేటి పర్యటన కార్యక్రమాలు

మంత్రి కొప్పుల ఈశ్వర్ నేటి పర్యటన కార్యక్రమాలు

జగిత్యాల ఎప్రిల్ 5 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నాటి పర్యటన వివరాలు ఆయన వ్యక్తిగత సహాయకుడు మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం పది గంటలకు పెగడపల్లి మండలం బతికెపల్లి లోని హనుమాన్ ఆలయ సందర్శనం, పదకొండు గంటలకు గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లి లో ఎడ్ల బండ్ల పోటీ కార్యక్రమానికి హాజరై, ఉదయం పదకొండున్నర గంటలకు ఎండపల్లి మండల కేంద్రం తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మీ సేవా కేంద్రం ప్రారంభం, మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎండపల్లి మండల కేంద్రం లోని జేపీఆర్ ఫంక్షన్ హాల్ జరిగే మాదిగ ఐక్యవేదిక సమావేశానికి హాజరు, మూడు గంటలకు గొల్లపల్లి పట్టణంలోని హనుమాన్ ఆలయ సందర్శన, మూడున్నర గంటలకు గొల్లపల్లి మండలం రాఘవపట్నం హనుమాన్ ఉత్సవాలకు హాజరౌతారని మోహన్ బాబు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!