Thursday, October 10, 2024
Homeతెలంగాణకార్యకర్తల మనోభావాలను గౌరవించేది బీఆర్‌ఎస్‌ పార్టీనే

కార్యకర్తల మనోభావాలను గౌరవించేది బీఆర్‌ఎస్‌ పార్టీనే

కార్యకర్తల మనోభావాలను గౌరవించేది బీఆర్‌ఎస్‌ పార్టీనే

మంథని ఏప్రిల్ 04(కలం శ్రీ న్యూస్ ): ప్రజాసంక్షేమాన్ని విస్మరించే కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగితే కష్టాలు తప్పవని ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త గుర్తించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

మంథని పట్టణంలోని రాజగృహాలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన ఒకే కుటుంబం తమ పదవుల కోసం ఆరాటపడ్డారే కానీ కార్యకర్తలు,నాయకులకు పదవులు ఇవ్వాలని ఆలోచన చేయలేదన్నారు.పార్టీ జెండా మోసే కార్యకర్తను పట్టించుకోని కాంగ్రెస్‌లో ఉన్నన్నిరోజులు కష్టాలు తప్పవన్నారు.దేశంలో కార్యకర్తల మనోభావాలను గౌరవించే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీనేనని ఆయన అన్నారు. పార్టీ కోసంకష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తుందని, వారికి పూర్తిస్థాయిలో అండగా నిలిచి గౌరవిస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్దితో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై ఆలోచన చేయాలని,ప్రతిపేదోడికి ప్రయోజనం చేకూర్చడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు.ఈ క్రమంలో ఎంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన వివరించారు. కాగా కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఖమ్మంపల్లికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు ఉగ్గె మొగిలి,మాజీ వార్డు సభ్యులు వేల్పుల ఓదెలు,సుందిళ్ల శంకర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మెంత్రి నర్సయ్య,కొండ సది, వేల్పుల లింగయ్య, లక్ష్మయ్యతో పాటు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!