Thursday, October 10, 2024
Homeతెలంగాణపైడిపల్లి కి నేడు ముగ్గురు మంత్రుల రాక

పైడిపల్లి కి నేడు ముగ్గురు మంత్రుల రాక

పైడిపల్లి కి నేడు ముగ్గురు మంత్రుల రాక

జగిత్యాల ఎప్రిల్ 3 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లు సుడిగాలి పర్యటన చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అంబారిపేట, పైడిపల్లి, తాళ్ళకొత్తపేట, చెగ్యాం వరకు రోడ్డు పనులకు శంఖుస్థాపన, ఒక కోటి నలభై లక్షల రూపాయల వ్యయం తో నిర్మించే పైడిపల్లి పడకల్ రోడ్డు పనులకు శంఖుస్థాపన, అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, ముప్పై లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన సామూహిక కమ్యూనిటీల భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో ముగ్గురు మంత్రులు పాల్గొంటారని వెల్గటూరు, ఎండపల్లి మండలాల భారాస పార్టీ మండలాధ్యక్షులు చల్లూరి రామచంద్రం గౌడ్, సింహాచలం జగన్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఇట్టి కార్యక్రమానికి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!