ఏకలవ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం విజయవంతం చేయండి
మంథని, ఎప్రిల్ 02(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం లోని సూరయ్య పల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని ఈనెల నాలుగో తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఎరుకల ఏకలవ్య సంఘం మంథని డివిజన్ అధ్యక్షులు కుర్ర లింగయ్య, ఏకలవ్య విగ్రహ కమిటీ చైర్మన్ కుర్ర రాకేష్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీ హర్షిని రాకేష్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, ఎరుకల హక్కుల పోరాట సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు వలిగి ప్రభాకర్ హాజరవుతారని వారు తెలిపారు. విగ్రహావిష్కరణ సభాధ్యక్షులుగా బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్ లాల్ వ్యవహరిస్తారని తెలిపారు. వీరితోపాటు డివిజన్ లోని ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరవుతారన్నారు.ఇట్టి కార్యక్రమానికి మంథని నియోజకవర్గము లోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.ఇట్టి సమావేశంలో దుగ్యాల శ్రీకాంత్, ఉండాడి రాజయ్య పాల్గొన్నారు.