పేదవిద్యార్ధుల భవిష్యత్ కోసమే మా ఆరాటం
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 28(కలం శ్రీ న్యూస్ ): పేద విద్యార్ధుల భవిష్యత్ కోసమే తమ ఆరాటమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇంటర్ పరీక్షలకు హజరయ్యే విద్యార్ధులతో కాసేపు ముచ్చడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్దులకు మంచి విద్య అందించాలని నిరంతరం ఆలోచన చేస్తుంటామని, ఇందులో బాగంగానే ఆకలితో కళాశాలకు వచ్చే ఇబ్బందులు పడే విద్యార్ధుల ఆకలి తీర్చాలని పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా మధ్యాహ్న బోజనం అందించామన్నారు.విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని తపన ఉంటుందని, ఈ క్రమంలో ఏ సమయంలోనైనా సాయం అందించడంలో ముందుంటానని ఆయన భరోసా ఇచ్చారు. విద్యార్ధులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని మంచి పేరు తెచ్చుకోవాలని, అనేక కష్టాలు పడుతూ తమ పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని బాధ్యత విద్యార్ధులపై ఉందన్నారు. ఇంటర్ పరీక్షల్లో మంచిగామార్కులు తెచ్చుకుని ఉన్నత చదువులకు వెళ్లాలని ఆయన ఈ సందర్బంగా ఆకాంక్షించారు.