శ్రీ సీతారాముల ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవ వేడుకలు
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 27(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని పవిత్ర గోదావరి నది తీరంలోని శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో గల శ్రీ రామాలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఉగాది పండుగ నుండి శ్రీరామ నవమి వరకు జరిగే నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీరాములవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న గురువారం రోజున అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపబడునని శ్రీ రామాలయ దేవాలయం పూజారి గట్టు రాము తెలిపారు.తొమ్మిది రోజులపాటు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు రాము తెలిపారు. ఈ రోజున మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని గట్టు రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.