యేసుక్రీస్తు చూపిన ప్రేమను పంచాలి
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 27(కలం శ్రీ న్యూస్):యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మనుష్యులపై ఎలాంటి ప్రేమను చూపాడో ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలని హైదరాబాద్ నుండి వచ్చిన దైవజనులు శ్యామ్ సుకుమార్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరంలో జరిగిన వార్షిక సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే యేసుక్రీస్తు బోధనలు అందరూ ఆచరించదగినవని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నుండి వచ్చిన దైవజనులు అగస్టీన్, స్థానిక పాస్టర్లు వల్లూరి ప్రభాకర్, వాసాల జాన్, మంథని మార్క్, కలువల సామెల్, మంథని నవీన్, రాజేష్ సంఘ పెద్దలు అంకరి కుమార్, ఎంకే జోసఫ్, అందే రమేష్, మంథని రణవీర్, ప్రసాద్, ప్రేమ్ కుమార్, సదానందములు పాల్గొన్నారు.