Tuesday, October 8, 2024
Homeతెలంగాణసీఎంఆర్‌ఎఫ్‌తో పేదకుటుంబాలకు ఆర్థిక చేయూత

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదకుటుంబాలకు ఆర్థిక చేయూత

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదకుటుంబాలకు ఆర్థిక చేయూత

కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో బీదోడికి అన్యాయమే

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 27(కలం శ్రీ న్యూస్): ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం అందుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

మంథని పట్టణానికి చెందిన మాచిడి సత్యనారాయణగౌడ్‌ కు రూ.4లక్షలు,రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన లక్కాకుల శంకరయ్య కు రూ.2లక్షల విలువ చేసే ఎల్‌ఓసీ పత్రాలను సోమవారం రాజగృహాలో వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన వైద్యం పొందలేని పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ముందుగానే ఎల్‌ఓసీ పత్రాలు అందిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. అయితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఉన్నా బీదోడికి న్యాయం జరుగలేదని, కనీసం పేదోడి ఆరోగ్యం గురించి గత ప్రభుత్వాలు ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కేవలం కొంత మందికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చేశారే కానీ పేదవారికి ఆర్థికంగా ప్రభుత్వ పరంగా సాయం అందించలేదని విమర్శించారు.మంథని నియోజకవర్గంలోని ఎంతో మంది పేదవారికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థిక చేయూతనందించి ధైర్యం కల్పించిందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!