ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మర్చి 27(కలం శ్రీ న్యూస్): పార్లమెంటులో బీసీ బిల్లు సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్‌లను బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆవిష్కరించారు.
మంథని పట్టణంలోని రాజగృహాలో బీసీ సంఘం నాయకులతో కలిసి వారు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బీసీ బిల్లు సాధనలో బాగంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని,కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లతో ఏప్రిల్ 3,4 తేదీలలో ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో బీసీలంతా అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయలని కోరారు.