అపర భద్రాద్రికి పట్టు వస్త్రాలు, గోటితో వొలసిన తలంబ్రాలు సమర్పించిన సాయి రామభక్తులు.
కరీంనగర్,మార్చి26(కలం శ్రీ న్యూస్):సరిగ్గా 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇదే పునర్వాసు నక్షత్రం గురువారం రోజున అపర భద్రాద్రి నందు అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గోటి తో ఒలసిన కోటి తలంబ్రాల కార్యక్రమంలో దాదాపు 500 కుటుంబాల సభ్యులు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామ మంత్రాన్ని జపిస్తూ గోటి తో ఒలసిన తలంబ్రాలను ఆదివారం కోటి తలంబ్రాల మహా యజ్ఞం తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ఆధ్యాత్మికవేత్త నలుమాచు చంద్రశేఖర్ రాణి దంపతుల చేతుల మీదుగా భద్రాచల ఆలయ ఈవో గీతా కి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాత్ర కన్వీనర్ తాటిపల్లి సతీష్ బాబు. మిట్టపల్లి ఆంజనేయులు కవిత,వెలిచాల చంద్రమోహన్ పద్మ, పైడా మారుతి గంగాభవాని, నీలగిరి అనిత, సావిత్రి తిరుపతి, మల్యాల పావని, శ్రీరాముల రాము, సతీష్ ,అంజన్న, రాధిక, భారతి,గుడి కాడి శ్రీనివాస్, రాజశేఖర్, రాణి తదితరులు పాల్గొన్నారు.