Friday, September 20, 2024
Homeతెలంగాణఆద్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక దాతగా నిలిచిన న్యాయవాది రామడుగు రాజేష్

ఆద్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక దాతగా నిలిచిన న్యాయవాది రామడుగు రాజేష్

ఆద్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక దాతగా నిలిచిన న్యాయవాది రామడుగు రాజేష్

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 26 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించే చిరుతల రామాయణం నాటక ప్రదర్శన కార్యక్రమం లో భాగమైన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కొరకు సీతారామాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షుడు రామడుగు రాజేష్ న్యాయవాది పది వెయిల పదహారు రూపాయలు కళాకారులు బృందానికి ఆదివారం విరాళంగా అందించారు. ఆద్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన రామడుగు రాజేష్ కు కళాకారుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాన దాతతో పాటు నాటక ప్రదర్శన బోధకులు బొమ్మరవేణి రాజేశం, ఉప సర్పంచ్ గోనె గంగా రెడ్డి, ఎండపల్లి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సీపెల్లి శంకర్, తాల్లపల్లి మల్లేశం, సింగం శ్రీశైలం, గుండేటి వెంకటేశం, కోడిపుంజుల వెంకటేశం లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!