Saturday, July 27, 2024
Homeతెలంగాణవిద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : జిల్లా విద్యాధికారి మాధవి

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : జిల్లా విద్యాధికారి మాధవి

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి .

జిల్లా విద్యాధికారి మాధవి

ఘనంగా ఐపిఎస్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్,మార్చి25(కలం శ్రీ న్యూస్)విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. శనివారం పట్టణం లోని స్వప్న కాలనీ లోని ఇండియన్ పబ్లిక్ హైస్కూల్ 6 వ వార్షకోత్సవ ఫీనిక్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇవో మాధవి మాట్లాడుతూ విధ్యార్థులు ఒక లక్ష్యం దిశగా అడుగులు వేసి లక్ష్యాన్ని సాధించాలని, తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని, సమాజసేవలో ముందుండాలని అన్నారు. విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిచేలా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఐపిఎస్ యాజమాన్యాన్ని అభినందించారు. ఐపిఎస్ కరస్పాండెంట్ మాటేటి కృష్ణ ప్రియ సంజీవ్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తూ, సంస్కృతి సంప్రదాయాలను తెలియపరుస్తూ, విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందిస్తున్నామని అన్నారు. గత 6 ఏళ్లుగా తమ స్కూల్ అభివృద్ది కి సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విధ్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డిజే పాటలతో,విద్యార్థులు కేరింతలతో నానా హంగామా చేసి జోరుగా హుషారుగా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.

ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, మండల విద్యాధికారి సురేందర్, ట్రస్మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కరస్పాండెంట్ మాటీటి సంజీవ్, ప్రిన్సిపల్, డైరెక్టర్ మాటేటి కృష్ణ ప్రియ, బుచ్చి రెడ్డి, నరేష్, ఐపిఎస్ చైర్మన్ మాటేటి గట్టయ్య, అభిరామ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!