Thursday, September 19, 2024
Homeతెలంగాణఎండపల్లి మండల కేంద్రానికి ఆరోగ్య కరమైన పంచాయతీ మొదటి అవార్డు ప్రధానం 

ఎండపల్లి మండల కేంద్రానికి ఆరోగ్య కరమైన పంచాయతీ మొదటి అవార్డు ప్రధానం 

ఎండపల్లి మండల కేంద్రానికి ఆరోగ్య కరమైన పంచాయతీ మొదటి అవార్డు ప్రధానం 

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల కలం మార్చి 25 (శ్రీ న్యూస్)దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్ – వికాస్ పురస్కార్ (జాతీయ పంచాయతీ అవార్డ్స్) 2022-23 సంవత్సరమునకు గాను ఇరు మండలాల మేజర్ గ్రామ పంచాయతీ మండల కేంద్రము ఎండపల్లి కి హెల్తీ పంచాయితీ మొదటి అవార్డ్ ను వెల్గటూరు మండలం కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం రోజున సర్పంచ్ మారం జలేందర్ రెడ్డి కి ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ సుధా రాణి లు ప్రశంసా పత్రం అందించి సన్మానించారు.

ఈ అవార్డు ఎండపల్లి మండల కేంద్రానికి రావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, మండల మరియు గ్రామ స్థాయి అన్ని శాఖల అధికారులకు , పాలకవర్గ, వార్డు సభ్యులకు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రామ పంచాయితీ సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు, పేరు పేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ మారం జలేందర్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!