Friday, November 8, 2024
Homeతెలంగాణసహకార సంఘాలతో వ్యాపార వైవిధ్యం సాధ్యం

సహకార సంఘాలతో వ్యాపార వైవిధ్యం సాధ్యం

సహకార సంఘాలతో వ్యాపార వైవిధ్యం సాధ్యం

నూతన ఒరవడితో సహకార సంఘాన్ని అభివృద్ధి చేస్తాం

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,మార్చి 25(కలం శ్రీ న్యూస్):ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే వ్యాపార వైవిధ్యం సాధ్యమవుతుందని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ,సహకార సంఘాలు వివిధ రకాల వ్యాపారాలు చేసే సత్తా కలిగి ఉండటమే కాకుండా అభివృద్ధిలో ముందంజలో పయనిస్తున్నాయని తెలిపారు. నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు నాయకత్వంలో సహకార సంఘాలు, కెడిసిసి బ్యాంకులు మరింత అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కొండూరు రవీందర్ రావు దూరదృష్టిగల ‘కో ఆపరేటర్’ అని, ఆయన ప్రదర్శిస్తున్న వ్యాపార వైవిద్యం వలనే సహకార సంఘాలు బహూళ సేవ కేంద్రాలుగా మార్చుతూ దేశంలోనే తెలంగాణ ఖ్యాతిని చాటుతున్నారని అన్నారు. వ్యాపార పరంగా నూతన ఒరవడి సృష్టిస్తూ సంఘాన్ని మరింత పరిపుష్టం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నాగారం శివారులో రైస్ మిల్లు ఏర్పాటు, సంఘం యందు బాటిల్ వాటర్ ప్లాంటు నిర్మాణానికి షర వేగంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంఘం ద్వారా 2కోట్ల 75లక్షల 76వేలు రైతులకు ఋణాలుగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. కెడిసిసి బ్యాంకు యందు కరంటు,సేవింగ్ డిపాజిట్ల నిల్వ రూ.52లక్షలు ఉండగా, అత్యధికంగా మా పాలకవర్గ హాయాంలో ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ.3 కోట్లకు పెంచామని తెలిపారు. అలాగే గత రబీ, ఖరీఫ్ సీజన్లలో 34 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 7658మంది రైతుల నుంచి5లక్షల 27వేల 520 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.106కోట్ల 51లక్షలకు పైగా వ్యాపారం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక, వాటర్ షెడ్, పర్సనల్ లోన్స్, పెట్టి లోన్స్ 12కోట్ల19లక్షలు ఉండగా, సభ్యుల డిపాజిట్లు రూ.13లక్షల 72వేలు, ఎరువులు, విత్తనాల వ్యాపారం ద్వారా 1కోటి56లక్షల వ్యాపారం చేసి మన సంఘం ఏ గ్రేడ్ లక్ష్యానికి చేరువలో ఉందని తెలిపారు. సంఘ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు, వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, సంఘ సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధిలో సంఘ పాలకవర్గం, సిబ్బంది, సభ్యులు, రైతుల పాత్ర మరువ లేనిదని అన్నారు. సీనియర్ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొట్ట మొదటి సారిగా సంఘానికి వచ్చిన ఎక్కేటి అనంత రెడ్డికి పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ముందుగాసంఘ సీఈఓ మామిడాల అశోక్ కుమార్ సంఘ జమ ఖర్చులు చదివి వినిపించారు.ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిమూర్తి ఓదేలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, ఉడుత మాధవి పర్వతాల్ యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత, రైతుబంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్, గౌతమేశ్వర దేవస్థానం చైర్మన్ మెడగొని రాజమౌళి గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు ఎగోలపు శంకర్ గౌడ్,సమన్వయ సమితి నాయకులు గుండా పాపా రావు, కె డిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి బాణయ్య, కాయితి సమ్మయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్య లో సభ్యులు, రైతులు, సంఘ సిబ్బంది, పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!