Wednesday, May 29, 2024
Homeతెలంగాణజాతీయ పంచాయితీ అవార్డులలో మంథని పంచాయతీలు ప్రభంజనం 

జాతీయ పంచాయితీ అవార్డులలో మంథని పంచాయతీలు ప్రభంజనం 

జాతీయ పంచాయితీ అవార్డులలో మంథని పంచాయతీలు ప్రభంజనం 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని, మార్చి 24 (కలం శ్రీ న్యూస్ ): జాతీయ పంచాయితీ అవార్డులలో మంథని పంచాయతీలు ప్రభంజనం సృష్టించినట్లు మంథని ఎంపీపీ కొండ శంకర్ తెలిపారు. శుక్రవారం మంథని పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో మంథని ఎంపీపీ కొండ శంకర్ అధ్యక్షతన మంథని మండలంలోని జాతీయ అవార్డులు గెలుచుకున్న పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. తొమ్మిది రకాల అంశాలలో మంథని మండలంలోని మండల స్థాయిలో ప్రతి అంశంలో మొదటి మూడు స్థానాలు పొందినట్లుగా మంథని ఎంపీడీవో రమేష్ తెలిపారు. జాతీయ అవార్డు గెలుచుకున్న పంచాయతీలు నాగారం, చిల్లిపల్లి, మల్లేపల్లి, నాగిపల్లి, పుట్టపాక, మెరుపల్లి, మల్లారం గ్రామాలకు అవార్డ్ రావడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసి తొలిసారి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎక్కేటి అనంతరెడ్డిని మంథని ఎంపీపీ కొండ శంకర్ ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్ జెడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, ఎంపీటీసీలు, ఎంపీడీవో రమేష్, ఎంపీఓ ఆరీష్ , అవార్డు గ్రహీత సర్పంచులు, మండల స్థాయి అధికారులు, మండల ప్రజా పరిషత్ అధికారి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!