సుల్తానాబాద్ మున్సిపల్ కమీషనర్ గా నూతన భాద్యతలు స్వీకరించిన రాజశేఖర్.
సుల్తానాబాద్,మార్చి24(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపల్ కమీషనర్ గా హైదరాబాద్ నుండి వచ్చిన రాజశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మున్సిపల్ లో విధులు నిర్వహించిన కమీషనర్ నరసింహ గద్వాల్ కు బదిలీ కాగా అనంతరం పెద్దపల్లి కమీషనర్ శ్రీనివాసరెడ్డి అదనపు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో విధులు నిర్వహించిన రాజశేఖర్ తొలిసారిగా మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని గృహ, యజమానుల ,వర్తక, వ్యాపార దారులు విధిగా పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. పన్నులు చెల్లిస్తే ప్రభుత్వ నుండి నిధులు అధిక మొత్తంలో విడుదలవుతాయని ,అప్పుడు మున్సిపల్ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని, సకాలంలో ప్రజలు పన్నులు చెల్లించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం సుల్తానాబాద్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ ను మర్యాద పూర్వకముగా కలసి పుష్ప గుచ్చం అందజేశారు.