Saturday, July 27, 2024
Homeతెలంగాణచివరి విద్యార్థి వరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా భోదన జరగాలి 

చివరి విద్యార్థి వరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా భోదన జరగాలి 

చివరి విద్యార్థి వరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా భోదన జరగాలి 

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

తొలిమెట్టు కార్యక్రమం జిల్లాస్థాయి టిఎల్ఎం మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్, మార్చి 24(కలం శ్రీ న్యూస్):జిల్లాలో చివరి విద్యార్థి వరకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్య అందించాలని, వెనుకబడిన విద్యార్థులపై అధిక సమయం వెచ్చించి వినూత్న బోధన పద్ధతుల ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.

శుక్రవారం సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎఫ్.ఎల్.ఎన్. తొలిమెట్టు జిల్లా స్థాయి టి.ఎల్.ఎం. మేళా 2022-23 ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ప్రారంభించి ప్రదర్శనలను పరిశీలించి టీచర్ లతో మాట్లాడి విద్యార్థులకు బోధిస్తున్న తీరును, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంలో ప్రతి శాఖలో ఉద్యోగుల పనితీరు పర్యవేక్షించేందుకు వీలవుతుందని, విద్యాశాఖలో ఉపాధ్యాయులు సొంతంగా ఆసక్తి గావించి విద్యాబోధన చేసినప్పుడు ఉన్నత ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు.

 

కరోనా తర్వాత ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలు ఎంతమేరకు డెవలప్ అయ్యారని పరిశీలిస్తూ మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని కోరారు.

 

పెద్దపల్లి జిల్లాలో విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన విద్య అందించే దిశగా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్, ఉన్నత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ సైన్స్ ల్యాబ్ మొదలగు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రారంభించిన తొలిమెట్టు కార్యక్రమంలో సైతం ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించారని, మండల స్థాయిలో ఎంపికైన వినూత్న విద్యాబోధన ఎక్సిబిట్స్ను జిల్లా స్థాయిలో ప్రదర్శించామని, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా వినూత్న పద్ధతులలో బోధన చేస్తున్నారని, విద్యార్థులు ఆడుతూ, పాడుతూ నేర్చుకునే విధంగా బోధన పద్ధతులు రూపొందించినందుకు కలెక్టర్ ఉపాధ్యాయులను అభినందించారు.

 

ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే స్ఫూర్తి కొనసాగించాలని, వినూత్న విద్యా బోధన పద్ధతులు మండలంలో ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో అమలు చేయాలని, జిల్లాలో చివరి పాఠశాల, చివరి విద్యార్థి వరకు మెరుగైన విద్య అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం గురించి వివరించారు. ఆగస్టు మాసంలో విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించి 12 శాతం ఉన్న కనీస విద్యా ప్రమాణాలు ఇప్పటికీ 60 శాతం వరకు మెరుగుపరచడం జరిగిందని తెలిపారు.

 

జిల్లాలోని 36 విద్యా కాంప్లెక్స్ ల పరిధిలో 361 ప్రాథమిక పాఠశాలలు, 84 ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 16 వేల 324 మంది విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి నెల మండల స్థాయిలో రివ్యూ సమావేశం నిర్వహించి వినూత్న విద్యాబోధన పద్ధతులు వివరిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని 300 పై చిలుకు ప్రాథమిక పాఠశాలల టీచర్లు విద్యార్థులకు సులభ పద్ధతిలో విషయ పరిజ్ఞానం అర్థం అయ్యేలా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ లపై రూపొందించి ప్రదర్శించిన ఎక్సిబిట్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మంచి ఎక్సిబిట్స్ రూపొందించిన ఉపాధ్యా యులను శాలువాతో సత్కరించగా,మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా సేవలందించిన 50 మంది రిసోర్స్ పర్సన్, 10వ తరగతి స్టడీ మెటీరియల్ తయారు చేసిన 31 మంది ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందించారు.అంతకుముందు గర్రేపల్లి పాఠశాల విద్యార్ధినులచే స్వాగత నృత్యం, తొలిమెట్టు పై బుర్రకథను ప్రదర్శించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి, ఎంపీడీఓ శశికళ, ఆర్.ఐ., అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.ఎం. షేక్, సెక్టోరియల్ అధికారులు ఐ. విజయ్ కుమార్, జే. శ్రీనివాస్, అనురాధ, ఎంఈఓ సురేందర్, ప్రధానోపాధ్యాయులు మాధవిలత, సైన్స్ అధికారి రవినందన్ రావు, గ్రామ సర్పంచ్ వీరగొని సుజాత రమేష్ గౌడ్, ఉప సర్పంచ్, ఎంపిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!