Saturday, July 27, 2024
Homeతెలంగాణతీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

సుల్తానాబాద్,మార్చి24(కలం శ్రీ న్యూస్):క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న పై అతని సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడానికి నిరసిస్తూ శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక సతీష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సౌదరి మహేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్ తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక లేకుండా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలను ప్రతిరోజు వెలుగులోకి తీసుకువచ్చే తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి చేయడమే కాకుండా తిరిగి ఆయన పైనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం  హేయమైన చర్యగా అభివర్ణించారు. బంగారు తెలంగాణ అంటే అక్రమ అరెస్టు లేనని ఆరోపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిత్యం అవినీతి అక్రమాలతో నిండిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఏ కార్యాలయానికి వెళ్లిన అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని, అతనిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనియెడల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజాసంఘాలు ప్రజల అందరితో కలిసి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమిరిషెట్టి తిరుపతి, నారాయణపూర్ ఎంపిటిసి సభ్యులు మండల రమేష్, బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, బిజెపి నేత కామని రాజేంద్రప్రసాద్, ఆరేపల్లి కిరణ్, జర్నలిస్టులు చందు, గోపి,నూక రాందాస్, రాపోలు రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!