Saturday, July 27, 2024
Homeతెలంగాణతీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుకు మద్దతు తెలిపిన బిజెపి, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుకు మద్దతు తెలిపిన బిజెపి, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుకు మద్దతు తెలిపిన బిజెపి, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు

సుల్తానాబాద్,మార్చి24(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వం తీర్మార్ మల్లన్న, అతని సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకొని, క్యూ న్యూస్ నీర్వాహకులు తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్, బిజెపి నాయకులు ఉమ్మడిగా సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పై, అతని సిబ్బందిపై కుట్ర పూరితంగా ప్రభుత్వం అవినీతి అక్రమాలను, వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నాడనే కారణంతో ప్రశ్నించే గొంతుకను నొక్కి ,తీన్మార్ మల్లన్నను అతని సిబ్బందిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అధికార పార్టీ పలుకుబడినీ ఉపయోగించి తీన్మార్ మల్లన్న జైలుకు పంపడం జరిగిందనీ,ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలను క్యూ న్యూస్ ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం ద్వారా అది ఓర్వలేని సీఎం కేసీఆర్, కేటీఆర్ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తమ కబంద హస్తాలలో పెట్టుకొని, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం తీవ్రంగా ఖండించాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు. ఇకనైనా ప్రభుత్వం తీన్మార్ మల్లన్న పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ,ప్రజా సంఘాలు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిలుక సతీష్, సాయి మహేందర్,  కుమార్ కిషోర్, బిజెపి నాయకులు ఎల్లంకి రాజయ్య, చౌదరి మహేందర్, కొమ్ము తిరుపతి, కామని రాజేంద్రప్రసాద్, గొస్కుల రవీందర్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!