మృతుని కుటుంబానికి చేయూత అందించిన బొద్దుల
జూలపల్లి,మార్చి24(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం నాగులపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన రాగళ్ళ చిన్న లచ్చయ్య అనారోగ్యంతో చనిపోగా దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందించాలని స్థానిక నాయకులు కేసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా, వెంటనే స్పందించి లచ్చయ్య కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు , జిల్లా ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య ల ద్వారా అందించడం జరిగింది.
ఇట్టి సహాయం అందించిన లక్ష్మణ్ కి లచ్చయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కందుకూరి వెంకటయ్య, సూరిశేట్టి శంకరయ్య, రాజేశం, మళ్లారపు అంజయ్య, లక్కాకుల శ్రీనివాస్, చిప్ప శ్రీకాంత్, దూస సంపత్, తదితరులు పాల్గొన్నారు.