Wednesday, December 4, 2024
Homeతెలంగాణమంథని కవి గాయకునికి ఘన సన్మానం 

మంథని కవి గాయకునికి ఘన సన్మానం 

మంథని కవి గాయకునికి ఘన సన్మానం 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,మార్చి 23(కలం శ్రీ న్యూస్):మంథని కవి,గాయకుడు గట్టు కృష్ణమూర్తిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఘనంగా సత్కరించి సన్మానించారు. ఉగాది పర్వదిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో మంథని పట్టణానికి చెందిన గట్టు కృష్ణమూర్తి, గుడిపాక శ్రీహరి పాల్గొన్నారు. ఈ కవి సమ్మేళనం కార్యక్రమంలో గట్టు కృష్ణమూర్తి రాష్ట్ర అభివృద్ధి పథకాలను వర్ణిస్తూ రాసిన కవిత అందరిని విశేషంగా ఆకర్షించిందని ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గట్టు కృష్ణమూర్తిని ఘనంగా శాలువాతో సన్మానించి, సత్కరించి అవార్డు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!