Sunday, September 8, 2024
Homeతెలంగాణపేదోడికి కార్పోరేట్‌ వైద్యం అందించడమే సర్కారు లక్ష్యం

పేదోడికి కార్పోరేట్‌ వైద్యం అందించడమే సర్కారు లక్ష్యం

పేదోడికి కార్పోరేట్‌ వైద్యం అందించడమే సర్కారు లక్ష్యం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 23(కలం శ్రీ న్యూస్): ఆర్థికస్థోమత లేని పేద కుటుంబాలకు కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నదే సర్కారు లక్ష్యమని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌పుట్ట మధూకర్‌ అన్నారు.గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు.రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గాజుల రవికాంత్ తండ్రి :లస్మయ్య కు 42,500 రూపాయల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహయ నిధి పథకం వరంలాంటిదన్నారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లోచికిత్స పొంది ఆర్థికంగా నష్టపోతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేలా సీఎం కేసీఆర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ పథకాన్నిపకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. ఆర్థికస్థోమత లేని నిరుపేదలకు ఆస్పత్రుల్లో వైద్యఖర్చులకు ప్రభుత్వం ద్వారా సాయం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో ఈ పథకం ఉన్నా పేదోడి దరికి చేరలేదన్నారు. పేదల ఆరోగ్యాన్ని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని, మంథనిలాంటి మారుమూల గ్రామాల్లోని ఏ ఒక్కరికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా లబ్ది చేకూరలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ,సీఎం కేసీఆర్‌ పరిపాలనలో ఎంతోమందికి ఈ పథకం ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!