ధర్మపురి నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడిగా బండి సత్యనారాయణ ఎన్నిక
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల మార్చి23 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండ పల్లి మండల కేంద్రము పెద్దమ్మ గుడి ఆవరణలో గురువారం రోజున ధర్మపురి నియోజక వర్గ దివ్యాంగుల కమిటీ ని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర రాజయ్య ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు.
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ దివ్యాంగుల కమిటి అధ్యక్షుడి గా బండి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గా గొల్లపెల్లి శ్రీధర్, జక్కుల మల్లయ్య. ప్రధాన కార్యదర్శి గా కోరుట్ల లక్ష్మణ్, సహాయ కార్యదర్శులు గా మేడి చల్మల శ్రీనివాస్, దేవి నాగేంధర్, కోశాధికారి గా అనంతుల శేఖర్, ప్రచార కార్య దర్శి గా ఉప్పులాంచ శ్రీధర్, కార్యవర్గ సభ్యులు గా గ్యానవేని కొమురయ్య, ఎనగంటి, గంగయ్య, వడగొండ సురేష్, రెడపాక రాజేందర్, వర్ణవెల్లి, సత్తయ్య, ఎంబడి సతీష్, గౌరిశెట్టి చంద్ర శేఖర్ లు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఎండపల్లి ఎంపిటిసి మహ్మద్ బషీర్ అన్నదానం చేసి ఆయన ఉదారతను చాటారు.