Tuesday, October 8, 2024
Homeతెలంగాణమీ రుణం తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం

మీ రుణం తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం

మీ రుణం తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని, మార్చి 22(కలం శ్రీ న్యూస్):ఇందిరమ్మ పథకంలో పేదోళ్లకు మంజూరైన బిల్లులు తీసుకుని గుళ్లు, పంక్షన్‌హాల్‌లు కట్టించిన చరిత్ర గత కాంగ్రెస్‌ పాలకులదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఎద్దేవా చేశారు.

కమాన్ పూర్ మండల కేంద్రంలో డీఎంఎప్టీ నిధుల ద్వారా నిర్మించనున్న కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.

ఈ సందర్బంగా కురుమ కులస్తుల ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం బీరన్న దేవాలయంలో కురుమ కుల దైవమైన బీరన్న, అక్క మహంకాళి అమ్మవారిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ఇందిరమ్మ పథకంలో ఎంతో మంది పేదల పేర్లతో బిల్లులు తీసుకుని గుళ్లు, పంక్షన్‌హాల్‌లు, కుల సంఘాల భవనాలు నిర్మించారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆలయ నిర్మాణం చేయిస్తామని చెప్పి పది సిమెంట్‌ బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కుల సంఘాల సంక్షేమాన్ని గత పాలకులు విస్మరించారని ఆయన అన్నారు. అయితే ఆలయనిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందన్నారు. ఎంతో మంది నిరుపేదల పేరుతో ఇందిరమ్మ బిల్లులు మంజూరైతే వాటిని ఇలాంటి పనులకు వినియోగించి నిరుపేదలను బదనాం చేశారని ఆయన గుర్తు చేశారు. తాము ఏనాటి పేదవారిని ఇబ్బందిపెట్టే పనులు చేయలేదని, నీతిగా నిజాయితీగా ప్రభుత్వ నిదులతోనే అభివృద్ది పనులు చేయిస్తున్నామన్నారు. కురుమ సంఘం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డామని, ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎంఎఫ్టీ ద్వారా పది లక్షలు మంజూరీ చేయించామన్నారు. గత పాలకులు ఏ విదంగా అభివృధ్దిచేశారో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ది జరుగుతుందో ప్రజలు చర్చ జరుపాల్సిన అవసరం ఉందని, తాను చర్చ జరుగాలని పదే పదే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు ఇచ్చిన మాట ప్రకారమే అందరూ కలికట్టుగా ఒక్కటై తనకు మెజార్టీ ఇచ్చారని, ఎంత కష్టం వచ్చినా తనకు మెజార్టీ ఇచ్చిన కమాన్‌పూర్‌ టౌన్‌తో పాటు గుండారం ప్రజలను రాజకీయాల్లో ఉన్నన్నిరోజులు మర్చిపోనని అన్నారు. మాట ఇచ్చినట్లుగానే కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిదులు తీసుకువచ్చానని, ఇలా మీ రుణం తీర్చుకునే అవకాశం రావడం తన అదృష్టంగా బావిస్తున్నట్లు చెప్పారు. కమాన్‌పూర్‌ మండల అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!