Wednesday, December 4, 2024
Homeతెలంగాణతల్లిదండ్రుల జ్ఞాపకార్థం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు

సుల్తానాబాద్,మార్చి21(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన కీర్తిశేషులు మాదాసు లక్ష్మి-నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు వృత్తి రీత్యా కరీంనగర్లో స్థిరపడిన మాదాసు శ్యామల – విశ్వనాథం, మనుమడు, మనుమరాలు మాదాసు శ్రీహిత ,మైత్రేయ లు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనవసరపు ఖర్చులు పోకుండా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని, అన్నదానం చేస్తే మహా పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, తుమ్మ అరుణ్, ఆశాడపు క్రాంతి కుమార్, సెంట్రల్ ఇంచార్జ్ శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!