Friday, July 19, 2024
Homeతెలంగాణవివేకానంద పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే

వివేకానంద పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే

వివేకానంద పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే

సుల్తానాబాద్ మార్చి 17 కలం శ్రీ న్యూస్,
సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో శనివారం రోజున ఫేర్వెల్ డే ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు బాలకృష్ణ ప్రసాద్ ఉమారాణి డైరెక్టర్ భూసారపు రవీందర్ సుజాత ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించినా పుట్టిన ఊరును, చదువు చెప్పిన ఉపాధ్యాయులను,చదువుకున్న పాఠశాలను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు చదువుతోపాటు పాటు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. మీరు కూడా బాగా చదువుకొని అగ్రస్థాయికి వెళ్లి పాఠశాలను మరింత పేరు తెచ్చేలా పాటుపడాలని కోరారు. కృషి, పట్టుదల మీ ఆయుధాలైతే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యార్థులుగా మొదలైన మీ జీవితం అభివృద్ధిలో ముందుకు వెళుతూ తిరిగి ఇదే పాఠశాలలో , అధికారులుగా వస్తే ఆ రోజు మాకు నిజమైన సంతోషం కలుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థినులు విద్యార్థులు ప్రదర్శించిన సాంసకృతిక ప్రదర్శనలు, సినిమా పాటలకు వేసిన స్టెప్పులు అందరిలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చందు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!