మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం
మహిళ అక్కడికక్కడే మృతి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 17(కలం శ్రీ న్యూస్):పెద్దపెల్లి జిల్లా మంథని నుండి కాటారం వెళ్లే రహదారిపై బట్టుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఒక ఇసుక లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.సంఘటనా స్థలంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మధుకర్ ( 32 ), అతని భార్య రాపాక సౌజన్య ( 28 ) , సమీప బంధువు రాపాక యశ్వంత్ ( 15 ) ద్విచక్ర వాహనంపై గొర్లవీడు గ్రామానికి పెళ్లికి వెళుతూ ఉండగా ఇసుక లారీ ఢీకొని ప్రమాదం జరిగింది.విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో సౌజన్య అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు మృతదేహన్ని మర్ఛూరికి తరలించారు.
రాపాక మధుకర్, యశ్వంత్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రి కి తరలించారు.