రంజాన్ సమయ సూచిక క్యాలెండర్ ఆవిష్కరణ
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని, మార్చి 16(కలం శ్రీ న్యూస్): ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సమయ సూచిక క్యాలెండర్‌ను బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ గురువారం మంథని లోని రాజగృహాలో ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. రంజాన్ మాసం సందర్బంగా ప్రార్థనల సమయాలతో కూడిన టైం టేబుల్ క్యాలెండర్ ముస్లిం సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.