నిరుపేద అమ్మాయి పెళ్ళికి అండగా నిలచిన ఎమ్మెల్సీ ఎల్.రమణ
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల మార్చి 16 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం శాలపల్లి గ్రామానికి చెందిన దూస చిలుకప్ప (పద్మశాలి) కూతురు శ్వేత వివాహం శుక్రవారం జరుగనుంది. పెళ్లి కూతురు పేద కుటుంబం ఇట్టి విషయాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అద్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త విషయాన్ని బుధవారం రాత్రి చెరవాణి ద్వారా తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సభ్యుడు రమణకి విషయం వీవరించగా సహృదయం తో సానుకూలంగా ప్రతి స్పందించి ఐదు వెయిలరూపాయల విలువగల పెళ్లి వస్తు, సామాగ్రి లను గురువారం పంపించగా రమేష్ గుప్త పంపిణీ చేశారు.అర క్వింటాళు బియ్యం సారే, చీర, వస్తు సామాగ్రి లు అందించారు. ఈ కార్య క్రమమం లో గ్రామ ప్రజలు పెళ్ళింటి బంధువులు పాల్గొన్నారు. పేదింటి పెళ్లి కి అండగా నిలిచి సహాయం చేసిని ఎమ్మెల్సీ ఎల్ రమణ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు శత మానం భవతి తెలిపారు.