కిషన్ రావుపేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల మార్చి 15(కలం శ్రీ న్యూస్):వెల్గటూరు మండలం లోని కిషన్ రావుపేట నరసింహస్వామి గుట్ట వద్ద వెల్గటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000 సంవత్సరం లో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థులు బుధవారం రోజున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.చాలా ఏళ్ళ తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు అందరు తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తమ గురువులను ఆప్యాయంగా పలకరించి తోటి స్నేహితులతో సరదాగా గడిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో గాలిపెల్లి నరేష్, కుషణపల్లి రాజేష్, బుర్ర సతీష్, పత్తిపాక వెంకటేష్, సుద్దాల నరేష్, సుద్దాల సుభాష్, వేయిగండ్ల అంజయ్య, సతీష్, గొల్లపల్లి ప్రసాద్, వాసం తిరుపతి,పొన్నం తిరుపతి, జొగం వేణు, గుమ్ముల మల్లేష్, గౌరు సంతోష్, నారాయణ, చంద్ర శేఖర్, గోళ్ల సత్తయ్య, కొమురయ్య లు పాల్గొన్నారు.