మేలు చేసిన మిమ్మల్నీ ఏనాడు మర్చిపోం
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 15(కలం శ్రీ న్యూస్):రైతుల కష్టం తెలుసుకుని రైతుబిడ్డ గా మాకు చేసిన మేలును ఏనాడుమర్చిపోమని మంథని పట్టణం, ఖానాపూర్ గ్రామా రైతులు స్పష్టం చేశారు.మంథని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం (బండ్ల చెరువు) నుంచి ఖానాపూర్ గ్రామం వరకు డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.1.50 కోట్ల నిధులు మంజూరీ చేయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రాజగృహాలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. రైతులు, రైతు కూలీలకు మేలు జరిగేలా రహదారి నిర్మాణం చేయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామాలకు, రైతులకు చేసిన మేలు మర్చిపోమని, తల కోసినా పుట్ట మధు పేరునే వల్లిస్తామని వారు ఈ సందర్బంగా పేర్కొన్నారు.