స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన మహిళలు అందరికీ ఆదర్శంగా నిలవాలి.
నాబార్డ్ డిడిఎం అనంత పట్నాన
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 15(కలం శ్రీ న్యూస్ ):మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండడం పట్ల నాబార్డ్ డి డి ఎం అనంత పట్నాన ఆనందం వెలిబుచ్చారు. బుధవారం మంథని ఏపీవో స్వయం సహాయక బృందం కార్యాలయంలో స్వయం ఉపాధి పొందిన మహిళలకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మగ్గం వర్క్ లో శిక్షణ పొందిన మహిళలు ఇతరులను చైతన్య పరుస్తూ ముందుకు సాగాలన్నారు. అలాగే కోళ్ల పెంపకం బిస్కెట్లు తయారీ వంటి నాబార్డ్ ఉపాధి పథకాలను ఉపయోగించుకోవాలన్నారు.మహిళలందరూ సమిష్టిగా చేరి జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పొందాలన్నారు. పచ్చళ్ళు బేకరీ లాంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించే వారికి చేయూతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, యూనియన్ బ్యాంక్ మేనేజర్, డిపిఎం రవి,ఎం పి ఎం పద్మ, ఎన్జీవో వి ఆర్ ఆర్ డి ఎస్ రజిత రవి, ఇంజనీర్ యజ్ఞంభట్ల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.