Saturday, July 27, 2024
Homeతెలంగాణపైడిపల్లి, గొడిశెలపేటలో పంటలను పరిశీలించిన ఏడీఏ రాంచందర్

పైడిపల్లి, గొడిశెలపేటలో పంటలను పరిశీలించిన ఏడీఏ రాంచందర్

పైడిపల్లి, గొడిశెలపేటలో పంటలను పరిశీలించిన ఏడీఏ రాంచందర్

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ 

జగిత్యాల మార్చి (14 కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి, ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామాలలో ధర్మపురి డివిజన్ రెగ్యులర్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాంచందర్ మంగళవారం రోజున వివిధ రకాల పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారని ఏఈఓ వినోద్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో భాగంగా గొడిశెలపేట గ్రామం లోని పెసరు చేలు, వరి పొలాల్లో రైతులు వేసిన పంటలను పరిశీలించి పైరుకు సోకే అగ్గి తెగులు, మొగి పురుగు తెగులు సోకినపైరును గుర్తించి వాటి నివారణకు గాను ట్రైసైక్లోజొల్ లేదా ఐసోప్రోథాలిన్ మందును, మొగి పురుగు నివారణ కు కార్తప్ హైడ్రోక్లోరిడ్ మందు ను స్ప్రే చేయాలని రైతులకు ఏడీఏ రాంచందర్ సూచించారు.

 పెసరు పంటకు సోకిన వైరస్ తెగుళ్లు, రసం పీల్చే పురుగులను గుర్తించారు. తెగులు నివారణకు ఎసిఫేట్ మందు ను వడాలని, పంట పొలాల్లో ఒడ్డుల మీద గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు సస్య రక్షణ గైకొనాలని రైతులకు ఆయన తెలిపారు.

గొడిశెలపేట గ్రామంలో ఆన్ లైన్ లో లేని 20 సర్వే నంబర్ లు తిరిగి ఆన్లైన్ లో నమోదు చేశామని వారు తెలిపారు. అనంతరం పామాయిల్ పంట గురించి గోడిషేలపేట రైతువేదిక లో రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని వినోద్ తెలిపారు.అనంతరం పైడిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచు గంగుల నగేష్ భూమిలోని పామాయిల్ తోట ను పరిశీలించారు. కొమ్ము పురుగు తెగులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలను రైతులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారి అయ్యోరి వినోద్, పైడిపల్లి గ్రామ సర్పంచు గంగుల నగేష్, గోడిశెలపేట గ్రామ రెవెన్యూ సహాయకుడు మద్దెల మల్లేష్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!