రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పుట్ట దంపతుల పూజలు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్):కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన. బోనాల జాతరకు హజరైన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు, పాడిపంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు పుట్ట దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.