పూర్వ ప్రజా ప్రతినిధుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్ ):మంథని నియోజకవర్గంలోని పూర్వ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం ఏప్రిల్ 8, 9 తేదీలలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి కోరారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో పూర్వ ప్రజాప్రతినిధుల సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని నియోజక వర్గం 1952 వ సంవత్సరంలో ఏర్పాటు జరిగిందని, పెద్ద భౌగోళిక స్వరూప్యం కలిగిన నియోజకవర్గమని, దీని అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు సేవా తాత్పర్యంతో అహర్నిశలు కృషి చేశారని ఆయన కొనియాడారు. మంథని నియోజకవర్గంలోని శాసనసభ్యులు, సమితి అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగల్ విండో చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులుతో ఏర్పాటు చేసే సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కల్వచర్ల మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, కొండపాక సత్య ప్రకాష్, బుచ్చన్న గౌడ్, బోగోజు శ్రీనివాస్, మేడగోని రాజమౌళి గౌడ్ లు పాల్గొన్నారు.