Thursday, September 19, 2024
Homeతెలంగాణబెల్టు షాపులు ఆపే నాథుడే లేడా....?

బెల్టు షాపులు ఆపే నాథుడే లేడా….?

బెల్టు షాపులు ఆపే నాథుడే లేడా….?

వీధి వీధికో బెల్టు షాప్

మత్తుకు బానిస అవుతున్న యువత

పట్టించుకోని అప్కారి శాఖ 

మంథని మార్చి 10(కలం శ్రీ న్యూస్ ):గ్రామాల్లో అడ్డు అదుపు లేకుండా బెల్ట్ షాపులు విస్తరిస్తున్నాయి. మంథని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం మత్తులో యువత పెడదారి పడుతున్నారు. యువత భవిష్యత్తు మత్తులోకి వెళుతుంది. గతంలో పల్లెల్లోని ప్రతి గ్రామంలో ఒక బెల్ట్ షాపు ఉండేది కానీ ప్రస్తుతం గ్రామాల్లోని వీధుల్లో వీధికో బెల్ట్ షాపు ఏర్పాటు చేయడంతో యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది దీని మూలంగా యువకుల జీవితం అంధకారంలోకి వెళ్తుంది. సంబంధిత అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో పోటీపడి మరి బెల్ షాపులు గ్రామాల్లో పుట్ట గొడుగుల్లా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో బహిరంగంగా వేలంపాట ద్వారా బెల్ట్ షాపులు చేజిక్కించుకున్న బెల్ట్ షాపుల యజమానులు మధ్యం ప్రియుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.బెల్ట్ షాపులలో అధిక ధరకు మద్యం అమ్మడం, వంటి కార్యక్రమాలు గ్రామీణంలో కోకోల్లోలుగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. బెల్ట్ షాపులపై కొరడా జులుపించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో గ్రామాలలో బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి.అధిక ధరకు మద్యం విక్రయించడం ద్వారా అప్పుచేసి మరి యువత మద్యం కొనుగోలు చేయడం ద్వారా, యువత మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇకపోతే దీని పర్యవసారంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి పరోక్షంగా బెల్టు షాపులే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సమయ పాలన పాటిస్తూ మద్యం విక్రయిస్తుంటారు. కానీ పొద్దు మాపు, పగలు రాత్రి , అనే తేడా లేకుండా అడ్డు అదుపు లేకుండా 24 గంటలు బెల్ట్ షాపులు నడవడం వల్ల బెల్టు షాపులలో మద్యం లభించడంతో గ్రామాలలో వేకువ జాము నుండే యువకులు అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని బెల్టు షాపుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కోరుతున్నారు.అలాగే మంథని పట్టణంలోని పలు మద్యం షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ధరకు మద్యం విక్రయించకుండా అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ మద్యం విక్రయాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!