మంత్రి కొప్పుల కు స్వదేశాగమన స్వాగతం పలికిన భారాస నేతలు
జగిత్యాల, మార్చి 10 (కలం శ్రీ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల నిమిత్తం పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి స్వదేశాగమన శుభాకాంక్షలతో స్వాగతం తెలిపిన ఉమ్మడి వెల్గటూరు మండల భారాస పార్టీ నేతలు. వీరిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, నంది మేడారం పిఎసిఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఎండపల్లి పిఎసిఎస్ చైర్మన్ గూడ రాంరెడ్డి, ఎండపల్లి మండల కేంద్రం సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి లు ఉన్నారు.