Saturday, July 27, 2024
Homeతెలంగాణకంటి వెలుగు.. మీ ఇంటికి వెలుగు

కంటి వెలుగు.. మీ ఇంటికి వెలుగు

కంటి వెలుగు.. మీ ఇంటికి వెలుగు

కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య 

సుల్తానాబాద్,మార్చి09(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ రాం నగర్ ఏరియా లో 9 వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య ఇంటి వద్ద ఈ నెల 9వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్లు కంటి పరీక్షలు చేసిన అనంతరం మందులు , కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందనీ, అవసరం ఉన్నవారికి కంటి ఆపరేషన్ కూడా ప్రభుత్వం ఉచితంగా చేపిస్తుందనీ, ఈ కార్యక్రమాన్ని 9 వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ గొట్టం లక్ష్మి మల్లయ్య కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీజ , మధుకర్ రెడ్డి , శ్రీనివాస రెడ్డి , ఏఎన్ఎం సరస్వతి , డిఈఓ మానస , షెహనాజ్ , ఆశ వర్కర్లు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!