Wednesday, September 18, 2024
Homeతెలంగాణప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, మార్చి 8 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి శ్రమిస్తున్న జర్నలిస్టులకు ఎంత చేసినా తక్కువేనని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ప్రెస్ భవన్ నిర్మాణానికి మంజూరైన 10 లక్షల ప్రొసీడింగ్ ను ప్రెస్ క్లబ్ అద్యక్షులు శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్ సూర్యం లకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో గొప్పదన్నారు. అందులోనూ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని ఎన్నో వ్యయప్రయసాలకు ఓర్చి కుటుంబాలను వదిలి, ఎన్నో సమస్యలను ఎదురుకొంటు విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. ఇంతటి సేవచేస్తున్న జగిత్యాల జర్నలిస్టులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. జగిత్యాల మీడియా మిత్రులతో అనుబంధం ఈనాటిది కాదని ఎమ్మెల్యేగా కాక ముందే ప్రజాసేవలో ఉన్నప్పుడే ఎంతో అనుబంధం ఉందన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యేగా మొదటి సారిగా గెలుపొందానని ఒకసారి గెలువగానే రెండుసార్లు ఓడినట్లయిందన్నారు. స్థానిక సంస్థల్లో గెలుపొందడం, ప్రతిపక్ష అభ్యర్థి గెలవడం, వెను వెంటనే కరోన సంక్షోభంతో ఏర్పడడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అలాగే నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన కవితక్క ఓడిపోవడం అభివృద్ధికి మరింత ఆటంకం ఏర్పడిందన్నారు. గెలిచిన వెంటనే జర్నలిస్టులకు ఎంతో చేయాలని భావించడం జరిగిందని ఆటంకాలను అధిగమించి నర్సింగాపూర్ లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి సమీపంలోనే రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో ఐకెపి కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఏడు లక్షల రూపాయలు కేటాయించగా పనులు చివరిదశకు వచ్చాయన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలం కేటాయింపుకోసం నర్సింగపూర్ గ్రామ ప్రజలను సహకారం కోరడం జరిగిందని మరోసారి మీడియా ముఖంగా కొరుతున్నానని నర్సింగపూర్ ప్రజలు మీడియా మిత్రులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే జగిత్యాలలో కట్టినన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడాలేవని, మాకు తెలిసిన కాంట్రాక్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఇండ్ల పనులను పూర్తి చేస్తున్నారన్నారు. కొన్నిచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టు పొందినవారే పనులు చేయలేక చేతులెత్తేస్తున్నరని ఎమ్మెల్యే చెప్పారు. జగిత్యాల జర్నలిస్టులకు గెలిచిన నాటి నుంచి ఏదైనా చేయాలని తపన ఉండేదని, మొదట జర్నలిస్టులకు ఒక ఆఫీస్ ఉండాలని భావించానన్నారు. అందుకే గత కలెక్టర్ హయాంలో ఆర్డీవో ఆఫిస్ సమీపంలో ఓ భవనాన్ని ఇప్పించడంతోపాటు అందులో అవసరమైన 50 వేల ఫర్నిచర్ సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లాగా జగిత్యాల మారగా ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ సముదాయం నిర్మాణం జరిగి జిల్లా కార్యాలయాలు అన్ని ఒకచోట చేరాయన్నారు. ఈ నేపద్యంలో హైద్రాబాద్, కరీంనగర్ తరహాలో జగిత్యాల ప్రెస్ భవన్ కూడా కలెక్టరేట్ కు దగ్గరే ఉండాలన్న ఆలోచనతో 10 లక్షల నిధుల కేటాయించడం జరిగిందని స్థల కేటాయింపు చేస్తున్నామని ఈ నిధులతో స్థల చదును, ప్రహరీ నిర్మాణం వంటి పనులను చేపట్టుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ కు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!