Saturday, July 27, 2024
Homeతెలంగాణప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

కేసిఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండే వెంకన్న

సుల్తానాబాద్,మార్చి08,(కలం శ్రీ న్యూస్):మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు దండే వెంకన్న పటేల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు సూపర్డెంట్ రమ మరియు సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేసి వారిని ఘనంగా శాలువాతో సన్మానించి మహిళా దినోత్సవ వేడుకలను జరిపి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుండాలని, యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రా దేవతా అని ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాల్లో చెప్పబడిందని, స్త్రీ లేనిదే సృష్టి లేదని అన్నారు. ఆదరించే అమ్మ అని పిలిపించుకునే అంత గొప్పతనం స్త్రీ జన్మదని ఆచరణలో తెచ్చిపెట్టిందని మానవత్వాన్ని ప్రపంచమంతా చాటిందన్నారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవాదరం జిల్లా ప్రధాన కార్యదర్శి చాతల కాంతయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్ధుల సాయినాథ్, దాసరి సంపత్, వైద్యురాలు సునీత, తనుజ ,సిబ్బంది మధు చౌదరి, ఝాన్సీ ,రాధిక ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!