మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : నందిని
జగిత్యాల, మార్చి08, (కలం శ్రీ న్యూస్):సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత ల తనయ నందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రోజున ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వీడియో తో నందిని రాజకీయ రంగం లో ప్రవేశం చేసినట్లే నా అని కొందరు అనుకుంటే…తండ్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ అడుగుల్లో అడుగు వేస్తారని మరికొందరు అనుకొంటుండగా…తల్లి ఎంల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత చేసే అనేక కార్యక్రమాలకు కు కూడా చేదోడువాదోడుగా నిలవనున్నారని మరి కొందరు చెబుతుండగా…తల్లి తండ్రిని రెండు కళ్ళుగా చూస్తారని మరి కొందరు చెబుతుండగా అసలు నందిని ఏఏ అంశాల్లో పాల్గొంటారనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా నందిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే అందరు అనుకున్నారు.