Saturday, July 27, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ లో హోళీ పండుగ సంబరాలు

సుల్తానాబాద్ లో హోళీ పండుగ సంబరాలు

సుల్తానాబాద్ లో హోళీ పండుగ సంబరాలు

సుల్తానాబాద్, మార్చి 7 (కలం శ్రీ న్యూస్): హోలీ పండుగ వచ్చిందంటే యువకులు, పిల్లలు, మహిళలు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆడపడుచుల ఆటపాటలు, చిన్న పిల్లల జాజర ఆట పాటలతో గ్రామాలు మార్మోగుతుంటాయి. పండుగల్లో హోలీకి విశిష్టమైన స్థానం ఉంది. వసంత రుతువు ఆగమనానికి చిహ్నం ఈ పండుగ. ఈ రుతువులోనే చెట్ల ఆకులు రాలి కొత్త ఆకులు వస్తాయి. ప్రేమానురాగాలకు ప్రతీకగా, నూతన ఒరవడిని గుర్తు చేస్తూ వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో హోళీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సుల్తానాబాద్ గాంధీ నగర్ లో చిన్నపిల్లలు రంగులు చల్లుకుంటూ కేరింతలు వేస్తూ ఆనందంగా ఈ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!