Saturday, July 27, 2024
Homeతెలంగాణవాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

సుల్తానాబాద్, మార్చి 7(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐల రమేష్ పాల్గొని అనంతరం మాట్లాడుతూ..హోలీ పండుగను ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఆనందంగా జరుపుకునే పండుగని పురాతన కాలం నుంచి హోలీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, పురాణాలలో హోలీ వేడుకలు జరుపుకున్నట్లు ఉందని తెలియజేశారు. హోలీ మన భారతీయ సంస్కృతిలో భాగమని ప్రతి ఒక్కరు పాటించాల్సిన సాంప్రదాయమని, ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతో ఆనందాలతో పనులు జరుపుకోవాలని,ప్రజలు రంగుల హోలీ సందడితో, పాడిపంటలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, ఉండి రంగుల హరివిల్లులతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు.

అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలని సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ అనుమాల అరుణ బాబురావు,ఎండి ముస్తఫా, చొప్పరి సుమన్, గడ్డం అంజి, బండి రాజ్ కుమార్, పురం రమణ, కొలిపాక రవి ఎలగందుల మల్లేశం, విజయ్, ఆకుల కృష్ణ, తిరుపతి రెడ్డి, కొల్లూరి అశోక్, సతీష్, ఎల్లయ్య, ప్రవీణ్, రమేష్, బైరగోని ప్రభాకర్, అమీరి శెట్టి తిరుపతి, రాజలింగo,ఎలిగేటి రమేష్, సుంక వేణు, రిటైర్ ఉపాధ్యాయులు ప్రసాద్, మధు, గుండ మురళి, మల్లికార్జున్ ఎండి కాసిం,శ్రీనివాస్, నిట్టూరి శ్రీనివాస్, సాంబయ్య , వెంకన్న,లింగమూర్తి, బాలసాని శ్రీనివాస్,వాకర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!